ఘనంగా రానా-మిహీకాల వివాహం
హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు అయ్యాడు. శనివారం రాత్రి 8.30 గంటలకు సుమూహుర్త సమయంలో రానా-మిహీకా ఒక్కటయ్యారు. వివాహ వేడుకకు సంబంధించి వర్చువల్ రియాలిటీ వీడియో లింక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. రామానాయుడు స్టూడియోలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు. మిహీకా బజాజ్ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి. మొదట్లో ఈ యేడాది డిసెంబర్ లో రానా పెళ్లి ఉండవచ్చని సురేశ్ బాబు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆగస్టులోనే కానిచ్చేస్తున్నామని వెల్లడించారు.