డేంజర్ : పల్లెల్లోనూ విజృంభిస్తున్న కరోనా

పట్నం కంటే పల్లెలు సేఫ్ అనుకున్నాం. పట్నంలో కరోనా విజృంభిస్తున్న వేళ అందరు పల్లెలకు క్యూ కట్టారు. తట్టా బుట్టా సర్థుకొని ఊరికెళ్లిపోయారు. అయితే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లోనూ కరోనా విజృంభిస్తోంది. గ్రామాల నుంచి హైదరాబాద్ కు కరోనా చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వీరంతా 70శాతం పరిస్థితి సీరియస్ గా ఉన్నవాళ్లే ఉంటున్నారు.

అప్పటి వరకు ఊర్లలోనే ఆ గోలీ, ఈ గోలీ వేసుకొని తగ్గుతుందని భావిస్తున్నారు. తీరా పరిస్థితి సీరియస్ కాగానే హైదరాబాద్ ఆసుపత్రుల్లోకి వస్తున్నారు. దీంతోవారిని కాపాడటం కష్టమవుతుంది అంటున్నారు డాక్టర్లు. ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,256 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరింది. మరోవైపు 10 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 637కి పెరిగింది.