సమంత, రస్మిక.. అక్కాచెల్లెల్లు ?

స్టార్ హీరోయిన్ సమంత తన చెల్లెలుగా క్యూట్ హీరోయిన్ రష్మిక మందనని సెలక్ట్ చేసుకున్నట్టు సమాచారమ్. సామ్ ఇటీవల కాలంలో ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఇటీవల ఓ దర్శకుడు సామ్ ని కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని చెప్పారట. ఇది అక్కా-చెల్లెల కథని తెలిసింది.

అక్కగా సమంత కనిపించనుందట. ఇక చెల్లెలుగా ఎవరి తీసుకుందామనే ఆలోచనలో దర్శకుడు  ఉండగా.. రస్మిక ని తీసుకుందామని సామ్ చెప్పాడట. అంతేకాదు.. రస్మికతో తానే స్వయంగా మాట్లాడి ఒప్పిస్తానని హామీ  ఇచ్చిందట. రస్మిక అందరితో ఈజీగా కలిసిపోతుంటుంది. సామ్ తోనూ రస్మికకి మంచి స్నేహబంధం ఉంది. ఇప్పుడు వీరిద్దరు అక్కా చెల్లెలుగా మారబోతున్నారు. అక్కాచెల్లెలు కలిసి ఏం చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.