అడ్వాన్స్‌డ్‌ వెర్షన్’తో మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ 

హీరో పుట్టిన రోజు అనగా కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌) రిలీజ్‌ చేయడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. వీటికి ఇంకాస్త అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ తీసుకురావాలని చిరంజీవి అభిమానులు చూస్తున్నారట. ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజు ప్రీ సెలబ్రేషన్స్ లో భాగంగా కామన్‌ మోషన్‌ పోస్టర్‌ తీసుకొస్తారట.

దీని కోసం చిరంజీవి పీఆర్‌ టీమ్‌ ఓ వీడియోను రూపొందించిందట. చిరంజీవి పుట్టిన రోజుకు వారం ముందు అంటే ఆగస్టు 15న దీనిని విడుదల చేస్తారని సమాచారమ్ఇండస్ట్రీలోని 65 మంది ప్రముఖులతో దీనిని సోషల్‌ మీడియాలో పెట్టించాలని చూస్తున్నారట.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. కాజల్ కథానాయిక. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో ఆచార్య తెరకెక్కుతోంది. ఇందులో చిరు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఓ పాత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారని, అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఏపీసోడ్ లో మాత్రం మెగాస్టార్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని సమాచారమ్.