షాక్ : ‘అజ్ఝాతవాసి’పై పోలీస్ కేసు

విడుదలకు ముందు ‘అజ్ఝాతవాసి’కి మరో ఆటంకం ఏర్పడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘కొడకా కోటీశ్వరరావు.. ‘ అంటూ తనదైన స్టయిల్’లో ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట అభిమానులని తెగ ఆకట్టుకొంది. సినిమాలో ఈ సాంగ్ హైలైట్ అయ్యిందని ఇప్పటికే ముందస్తు రివ్యూలు చెబుతున్నాయి. ఐతే, సినిమా నుంచి ఈ పాటని తొలగించాలని విజయవాడకు చెందిన న్యాయవాది కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు.

‘కొడకా కోటీశ్వరరావు.. ‘ అంటూ పవన్ పాడిన పాట వలన ‘కోటేశ్వరరావు’ పేరు గల వారి మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా నుంచి ఆ పాటని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. మరీ.. ఈ కేసు ఏ మేరకు నిలబడుతుంది. న్యాయస్థానం అజ్ఝాతవాసి చిత్రబృందానికి ఏమి సూచనలు చేయనుంది అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా అజ్ఝాతవాసి హవా కనబడుతోంది.