సంజయ్’కు లంగ్ క్యాన్సర్
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కు మరో కష్టం వచ్చింది. ఆయనకి స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అని తేలింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం హూటాహుటిన అమెరికాకి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సంజయ్ కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో చేయించుకున్న టెస్టుల్లో సంజయ్ కి లంగ్ క్యాన్సర్ బయటపడింది.
సంజయ్ లంగ్ క్యాన్సర్ సోకడంపై ఆయన భార్య మాన్యతాదత్ స్పందించారు. సంజూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోన్నవారికి కృతజ్ఞతలు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మాకు మీ అందరి ప్రార్థనలు అవసరం. గతంలో మాదిరిగానే ఈసారి దీన్ని దాటుకొని రాగలమన్న విశ్వాసం ఉంది. అనవసరమైన పుకార్ల కారణంగా ఆందోళనకు గురికావద్దని, మీ ప్రేమతో మాకు సహకరించమని సంజు అభిమానులను కోరుతున్నాను. పరీక్షించడానికి దేవుడు మరోసారి మమ్మల్ని ఎంచుకున్నాడు. ఎప్పటిలాగే మరోసారి విజేతలుగా నిలుస్తామని తెలుసు. ఈ అవకాశాన్ని ఆశావాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిద్దాం అన్నారు మాన్యత.