మరో కేంద్ర మంత్రికి కరోనా
దేశంలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రికి వైరస్ సోకింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్కు కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశారు.
తనకెలాంటి కరోనా లక్షణాలు లేవని, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యశోనాయక్తో కలిపి ఇప్పటి వరకు ఐదుగురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, వ్యవసాయ మంత్రి కైలాష్ చౌధురి ఉన్నారు.