ఘనంగా నిహారిక నిశ్చితార్థ వేడుక

మెగా హీరోయిన్ నిహారిక నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్య, నిహారిక పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. ఫ్యామిలీ వేడుకగా ఈ వేడుకని నిర్వహించారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకి కదలి వచ్చింది.

చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్.. ఇలా మెగా హీరోలంతా ఈ నిశ్చితార్థ వేడుకలో కనిపించారు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది. డిసెంబర్ లో నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది.