థియేటర్స్ ఓపెన్ అయినా.. ఓటీటీల హవా తగ్గదు !

థియేటర్లు తెరుచుకున్నా.. ఓటీటీల హవా తగ్గదన్నారు నిర్మాత అల్లు అరవింద్. థియేటర్లపై ఓటీటీ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానిపై జరిగిన చర్చలో అరవింద్ పాల్గొన్నారు. ఓటీటీ ప్రజలకు బాగా చేరువైపోయింది. అందులో ఇచ్చే కంటెంట్‌ను బాగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి థియేటర్లు తెరుచుకున్నాక ఓటీటీని పక్కన పెట్టేస్తారనుకోవడం లేదన్నారు. ఫిబ్రవరి 8న ప్రారంభించిన ఆహా యాప్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పిన అరవింద్‌… ఇప్పటివరకు 40 లక్షల డౌన్‌లోడ్లు అయినట్లు తెలిపారు.

కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ప్రత్యేకమైన షోలు తీసుకొస్తున్నామని అన్నారు. ఇప్పటికే మా యాప్‌ కోసం చాలా షోలు సిద్ధం చేస్తున్నాం. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూనే కొత్తవి తీసుకొస్తాం. ఓటీటీ, థియేటర్‌ సమాంతరంగా నడుస్తాయి. భవిష్యత్తులో దేని పంథా దానిదిగానే కొనసాగుతాయి. థియేటర్లు, సినిమా పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ప్రజలు వారాంతంలోనే థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన రోజుల్లో వినోదం కోసం ఓటీటీలు, టీవీలు చూడటమేనన్నారు అరవింద్.