‘అజ్ఝాతవాసి’ అంత సాధ్యమా ?
భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’గా ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. మిక్సిడ్ టాక్’ని తెచ్చుకొన్నాడు. ఈ నేపథ్యంలో ‘అజ్ఝాతవాసి’ సేఫ్ గా బయటపడతాడా ? లేదా ?? అనే చర్చ అప్పుడే మొదలయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 125 కోట్లకి అమ్ముడయ్యాయి. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొన్న సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం కష్టమే. ఐతే, ఇటీవల కాలంలో మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిన సందర్భాలున్నాయి.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ యావరేజ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్స్ రాబట్టింది. అంతకు ముందు జై లవ కుశ, సరైనోడు, డీజే సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో అజ్ఝాతవాసి రూ. 125కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తెలుగు రాష్ట్రాలు, యుఎస్ లోనూ రికార్డు స్థాయిలో అజ్ఝాతావాసి రిలీజైయింది. యుఎస్ లో మరో భారతీయ సినిమాకు దక్కని రేంజ్ లో థియేటర్స్ ని సొంతం చేసుకొంది. ఇదీగాక, తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఝాతవాసి’కి వారం రోజుల పాటు బెనిఫిట్ షోస్ వేసుకొనేందుకు అవకాశం లభించింది. ఏపీలో రోజుకు 7షోస్, తెలంగాణలో రోజుకి 5షోస్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో.. అజ్ఝాతవాసి రూ. 125కోట్లు కలెక్ట్ చేయడం సులభమే.
ఇదే జరిగితే ‘అజ్ఝాతవాసి’ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టినట్టే. ఇప్పటివరకూ రూ.105 కోట్ల షేర్ తో ‘ఖైదీ నెంబర్ 150’ నాన్ బాహుబలి రికార్డుతో కొనసాగుతోంది. ఆ రికార్డును ‘అజ్ఞాతవాసి’ అధిగమించే అవకాశం ఉంది. సో.. పవర్ స్టార్ అబిమానులు. బీ.. హ్యాపీ.