జాతినుద్దేశించి ప్రసగించిన రాష్ట్రపతి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా విజృంభణతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని, ఈ వైరస్‌ పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో నెలకొన్న కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా సాయం చేసిందన్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న యోధులకు దేశం రుణపడి ఉందన్నారు. 

వందేభారత్‌ కార్యక్రమం ద్వారా 10లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని చెప్పారు. కరోనా వేళ ఇంటి నుంచి పని, ఈ-లెర్నింగ్‌ బాగా పెరిగాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమై జీవించడం నేర్చుకోవాలని సూచించారు. అయోధ్యపై సుప్రీం తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారని, మందిర నిర్మాణం కూడా ప్రారంభమైందని గుర్తుచేశారు. భారత్‌ – చైనా సరిహద్దులోని గల్వాన్‌ వద్ద చోటుచేసుకున్న ఘర్షణలో అమరులైన భారత సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు రాష్ట్రపతి చెప్పారు.