హీరోయిన్’ని మార్చేసిన వరుణ్ తేజ్


మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ గ్లామర్ బ్యూటీ నభా నటాషాపై మోజు పెట్టాడు. ఆమెని తన తాజా సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘బాక్సర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు.

తాజాగా ఆమె స్థానంలో నభా నటేష్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గగానే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. గత యేడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో విజయాలు అందుకొని జోరు మీదున్నాడు వరుణ్ తేజ్.