త్రివిక్రమ్’పై మండిపడుతున్నారు
సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అజ్ఝాతవాసి’ సినిమా అట్టర్ ప్లాపుగా తేలడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు పవన్’ని ఏవిధంగా అభిమానించారో, అతడి స్నేహితుడు త్రివిక్రమ్’ని అదే రేంజ్’లో అభిమానించారు పవన్ ఫ్యాన్స్. పవన్-త్రివిక్రమ్ ఇద్దరు కాదు. ఒక్కరే అన్నట్టుగా సాగింది వారి అభిమానం. ఐతే, ‘అజ్ఝాతవాసి’ రిజల్ట్’తో త్రివిక్రమ్’పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే టైటిల్ ప్రకటించడంలో జాప్యం జరిగినా ప్రశ్నించలేదు. అసలు స్టోరీ లైన్ ఏంటీ ? పవన్ పాత్ర పేరేంటీ ? ఏ విధంగా చూపించబోతున్నారు ? ఇలాంటి ప్రశ్నలేవి అడగలేదు. కేవలం త్రివిక్రమ్’పై ఉన్న నమ్మకంతోనే అడగలేడు. ఆఖరి క్షణంలో కాపీ మరకపడినా ఏమాత్రం డౌటు పడలేదు. పవన్ అభిమానులే కాదు.. పవన్’కు కూడా దర్శకుడు స్నేహితుడు త్రివిక్రమ్ అనే నమ్మకంతోనే స్క్రిప్టు, స్క్రీన్ ప్లేలోనూ వేలు పెట్టలేదు.
ఇంత నమ్మకం పెట్టుకొన్న త్రివిక్రమ్ మాత్రం పవన్’ని, ఆయన అభిమానులని, ఇండస్ట్రీని ఘోరంగా నిరాశపరిచాడు. ‘అజ్ఝాతవాసి’ ప్లాపుకు ప్రధాన కారణం త్రివిక్రమ్ నే. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్పే మాట ఇది. హాలీవుడ్ సినిమా “లర్గో వించ్” నుంచి కాపీ కొట్టాడు. ఐనా సరే.. దానికి కాస్త తనదైన మార్క్ కామెడీ టచ్ చేసి కామెడీ పాలు చేశాడు. మొత్తంగా ఇప్పుడు తొలిసారి పవన్ అభిమానుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. మరీ.. వారికి త్రివిక్రమ్ ఏమైనా క్షమాపణలు చెబుతాడేమో చూడాలి.