#PawanKalyanBirthdayCDP వచ్చేసింది !

సెప్టెంబర్ 2 – జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో మూడ్నేళ్ల ముందు నుంచే సెలబ్రేషన్స్ ప్రారభించారు పవన్ అభిమానులు. ఆ మధ్య #AdvanceHappyBirthdayPawankalyan యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. కేవలం 24గంటల్లోనే 6మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా  #PawanKalyanBirthdayCDP విడుదల చేశారు.

‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇవ్వనున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీ-ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఒక్కసారే మూడు సినిమాలు లైన్లో పెట్టేశారు. వకీల్ సాబ్ తో పాటు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు ప్రకటించారు. మరో రెండు సినిమాలని కూడా పవన్ లైన్ లో పెట్టేరనే ప్రచారం జరిగింది. ఇందులో పూరితో ఓ సినిమా ఉండనుందనే న్యూస్ వినిపించింది. కానీ అధికారిక ప్రకటన రాలేదు.