పవన్ అభిమానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల సాయం
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకి స్టెమ్ సెల్ థెరపీ అవసరం అయింది. దీని కోసం ఏపీ ప్రభుత్వం రూ. 10లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. ప్రజల హితం, సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్. పార్టీకి, కులాలకు, వర్గాలకు అతీతుడినని జగన్ మరోసారి నిరూపించుకున్నారని రాసుకొచ్చారు.
“జగన్ గారి 14 నెలల పాలనలో సరికొత్త రికార్డు. కోటిమందికిపైగా ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ ఫలాలందాయి. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులు అవసరం లేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అసలే లేదు. మీ గ్రామ వాలంటీర్లద్వారా అర్హులు గుర్తింపు” అని మరో ట్విట్ చేశారు విజయసాయి.
Our Hon. CM YS Jagan garu has proven that the ONLY CRITERIA for welfare IS NECESSITY. He proved his MAGNANIMITY yet again by sanctioning 10 lacs for stem cell therapy for a PAWAN KALYAN’s FAN. And he has proved that he is BEYOND PARTY, CASTE, CREED etc.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 17, 2020