కొవిడ్19 వైరస్’లోని ఈ రకం 10రెట్లు వేగంగా వ్యాపిస్తోందట !

ప్రపంచ దేశాలని గజ గజ వణికిస్తున్న కొవిడ్19 కొన్ని వందల రూపాంతరాలు ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తాజాగా మలేషియా పరిశోధకులు మరో షాకింగ్ విషయాన్ని కనుకొన్నారు. తాజాగా కొవిడ్‌ 19 వైరస్‌ D614G రకం ఉత్పరివర్తనం (మ్యుటేషన్) బయటపడినట్లు మలేషియా పరిశోధకులు వెల్లడించారు  ప్రమాదకరంగా భావిస్తోన్న D614G రకం మ్యుటేషన్‌ను 10రెట్ల వేగంతో ఇతరులకు సోకుతుందని మలేషియా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నూర్‌ హిషమ్‌ అబ్దుల్లా ప్రకటించారు.

అయితే బయటపడిన రెండు క్లస్టర్లలోనూ మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైరస్‌ కట్టడికి తీసుకున్న పకడ్బందీ చర్యలవలన పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘కరోనా’ కొమ్ము ప్రొటీన్‌లోని ‘D614G’ మార్పుల వల్ల ఈ వైరస్‌ కొత్తరూపాన్ని ధరించిందని అమెరికాలోని లాస్‌ ఆల్మోస్‌ నేషనల్‌ లేబొరేటరీ పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. బ్రెజిల్‌, ఐరోపా, మెక్సికో, వుహాన్‌లలో ఇప్పటికే ఏడు ‘D614G’ రకాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉత్పరివర్తనపై శాస్త్ర సమాజంలో విస్తృత చర్చ జరుగుతోంది.