కరీనా పెద్ద తిండిబోతు.. అయినా నాజుకు అందాలెలా ?
అందానికి అందం మీనింగ్ చెప్పిన బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. జీరో సైజు అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది.
మూడేళ్ల తైమూర్‌కు తల్లయినా కరీనా కపూర్ ఖాన్, త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరి ఇంతందంగా కనిపించే ‘బేగం పటౌడీ’ ఎంత కఠిన ఆహార నియమాలను ఆచరిస్తారో.. ఏ ప్రత్యేక ఆహారం తీసుకుంటారో అని చాలామంది భావిస్తుంటారు. మిగితా వారిలా అందం కోసం కరీనా నోరు కట్టుకు కూర్చోదట. బాగా తిట్టుందట. రోజుకి ఏకంగా ఐదుసార్లు తింటుందట. అది కూడా కడుపునిండా. న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ కరీనా డైట్ గురించి వివరించారు. కరీనా డైట్ ఛార్ట్ ఇలా ఉంటుందట.
* ఉదయం 9 గంటలకు: నానబెట్టిన బాదం పప్పులు/అరటిపండు
* మధ్యాహ్నం 12 గంటలకు: పెరుగన్నం- అప్పడం/రోటీ, పనీర్ కూర, పప్పు
* మధ్యాహ్నం 2 గంటలకు: (స్నాక్స్) బొప్పాయి పండు, వేరుశనగలు, చిన్న సైజు చీజ్ ముక్క లేదా మఖానా
* సాయంత్రం 5-6 గంటలకు: లిచ్చి లేదా మామిడి మిల్క్ షేక్/ మిక్స్చర్ మాదిరిగా ఉండే చివ్డా
* రాత్రి 8 గంటలకు రాత్రి భోజనం: వెజిటబుల్ పలావ్, పాలక్ రోటీ, రైతా/పప్పు అన్నం, కూర
* నిద్రపోయే ముందు: పసుపు లేదా జాజికాయ వేసిన పాలు