కాజల్.. నిశ్చితార్థం అయ్యిందా !?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సడెన్ షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. ఆమె పెళ్లి ఫిక్సయింది. ఇటీవల రహస్యంగా ఆమె నిశ్చితార్థ వేడుక జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ? అన్నది మాత్రం తెలీదు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ తో వివాహ నిశ్చితార్థం జరిగినట్టు సోషల్‌ మీడియా లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారమ్.

కరోనా లాక్‌ డౌన్ పెళ్లిళ్ల జాబితా పెరుగుతోంది. టాలీవుడ్ లో పెళ్లికానీ ప్రసాదులు నిఖిల్, నితిన్, రానా, సుజీత్ తదితరులు కరోనా లాక్‌ డౌన్ లో ఓ ఇంటివాళ్లు అయ్యారు. మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్సయింది. ఇటీవలే నిశ్చితార్థ వేడుక జరిగింది. డిసెంబర్ లో పెళ్లి జరగనుంది. ఆ లోపు కాజల్ పెళ్లి న్యూస్ రాబోతుంది. పెళ్లి డేటు దగ్గర పడ్డాక.. అభిమానులకి సడెన్ సప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనలో కాజల్ ఉన్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం కాజల్ ఆచార్య, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు ఒకట్రెండు వెబ్ సిరీస్ లో నటించేందుకు కాజల్ ఓకే చెప్పినట్టు సమాచారమ్. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఇక పెళ్లికి రెడీ అని కాజల్ ఎప్పుడో ప్రకటించింది. సరైన వాడికోసం వెతుకుతున్నానని తెలిపింది. ఇన్నాళ్లకి కాజల్ కి సరిజోడు దొరికినట్టుంది.