ఇళ్ల పట్టాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో న్యాయపరమైన చిక్కులతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఇళ్ల పట్టాల విషయంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సీటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొదని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విశాఖ, తిరుమలగిర్ ట్రైబల్ స్కూల్ స్థలం ఇళ్లపట్టాలుగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన కోర్టు.. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సీటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొదని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాల తర్వాత వాయిదా వేసింది.

వాస్తవానికి ఉగాధి రోజునే ఉచిత ఇళ్లపట్టాలు పంపిణి చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కరోనా విజృంభి మొదలైన నేపథ్యంలో వాయిదా వేసింది. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయ్. ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా అక్కడ చిక్కులే ఏర్పడ్డాయ్. హైకోర్ట్ ఇచ్చిన స్టేని ఎత్తివేయడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది.