ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ నామినేట్
క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన సెలక్షన్ కమిటీ రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురిని నామినేట్ చేసింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రెజ్లర్ వినేవ్ పోగట్, టీటీ ప్లేయర్ మానికా బత్రా, పారాఒలింపిక స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు నామినేట్ అయ్యారు. క్రీడా మంత్రిత్వశాఖ సెలక్షన్ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిటీ భేటీ అయ్యింది.
గత ఏడాది రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 2019 సీజన్లో రోహిత్ వన్డేల్లో 7సెంచరీలు చేశాడు. మొత్తం 1490 రన్స్ చేశాడు. ఇక రెజ్లర్ వినేశ్ పోగట్.. 2018 కామన్వెల్త్, ఏషియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఒకవేళ రోహిత్‌కు ఖేల్ రత్న అవార్డు దక్కితే.. ఆ అవార్డును అందుకున్న నాలుగవ క్రికెటర్‌గా అతను నిలుస్తాడు. ఇప్పటివరకు సచిన్, ధోనీ, కోహ్లీలు ఈ అవార్డును గెలచుకున్నారు.