సుశాంత్ సోదరిపై రియా సంచలన ఆరోపణలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ నుంచి రియా డబ్బులు గుంజిందనే ఆరోపణలున్నాయ్. ఈ మేరకు సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రియాని ముంబై పోలీసులు, ఈడీ కూడా విచారించిది. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో సుశాంత్ కుటుంబం, ఆయన సోదరిపై రియా సంచలన ఆరోపణలు చేసింది.

సుశాంత్ సోదరి తేడా అనే విధంగా రియా మాటలున్నాయి. ఒకరోజు రాత్రి తాను సుశాంత్‌ ప్లాట్‌లో ఉన్న సమయంలో ఆయన సోదరి పూటుగా మద్యం సేవించి తన పడకగదిలోకి వచ్చిందని, అనంతరం అసభ్యంగా తడిమిందని రియా ఆరోపించారు. ఈ విషయం సుశాంత్ కి చెబితే.. ఆయన సోదరిపై కోపడ్డారు. అప్పటి నుంచి సుశాంత్ ఫ్యామిలీతో తనకి విబేధాలు మొదలయ్యాయని వివరించింది. ఈ మేరకు ఓ లేఖని విడుదల చేసింది రియా. అయితే ఈ ఆరోపణలు సుశాంత్ ఫ్యామిలీ కొట్టిపారేసింది.