అఖిల్ కోసం బడా బ్యానర్
అఖిల్ అక్కినేని నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం మొదట నిర్మాతలుగా క్రిష్-రాజీవ్ రెడ్డిలు ఉన్నారు. ఇప్పుడీ వీరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఓ బడా బ్యానర్ అఖిల్-సురేందర్ రెడ్డి సినిమాని టెకప్ చేసే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి ఫలిస్తే.. ఓకే. లేదంటే.. ? అఖిల్ సినిమా కోసం నిర్మాత వేట కొనసాగించాల్సి ఉంటుంది. అఖిల్ స్థాయిని మించిన బడ్జెట్ తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి అనుకోవడం వల్లనే ఈ ప్రాజెక్టుకు నిర్మాత దొరకడం లేదనే టాక్ నడుస్తోంది.