బాలు ఆరోగ్యంపై చిరు వీడియో

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బాలు ఆరోగ్యంపై వీడియో మేసేజ్ విడుదల చేశారు.

“బాలుతో నాది సినిమా బంధమే కాదు, కుటుంబపరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో మేం పక్కపక్క వీధుల్లో ఉంటూ తరుచూ కలుసుకునే వాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది. బాలును నేను అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటాను. బాలు చెల్లెళ్లు వసంత, శైలజలు కూడా నన్ను అన్నయ్యలా చూసుకుంటారు. గడిచిన 3 రోజులుగా వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్ తో టచ్ లో ఉన్నారు చిరంజీవి. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నా”నన్నారు మెగాస్టార్.