సుకుమార్’కు బన్నీ డెడ్ లైన్

అల్లు అర్జున్-సుకుమార్’లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య 2 ప్రేక్షకులని మెప్పించాయి. వీరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఇప్పటికే సినిమా సగం పూర్తయ్యేదే. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా లెక్కలు మారబోతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా విషయంలో సుకుమార్ కు బన్నీ డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది.

పుష్ప సినిమాను పక్కగా అనుకున్న షెడ్యూళ్లు అనుకున్నట్లు పూర్తి చేసేయాలని, తను ఎలా వర్క్ చేయడానికైనా రెడీ అని, అలా కాకుండా లేట్ చేసి, ఏళ్లూ, పూళ్లూ తీస్తూ వుంటానంటే మాత్రం కుదరదని బన్నీ క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. లేదూ, అలా కుదరదు అంటే, తను గెటప్ తీసేస్తానని, అప్పుడు విగ్ పెట్టి షూట్ చేసుకోవాల్సి వుంటుందని కూడా బన్నీ క్లారిటీ ఇచ్చేశాడట

ఈ సినిమా తరువాత బన్నీ కొరటాల శివ సినిమా చేయాలి. ఆయన ఆచార్య సినిమా పూర్తి చేసిన నెలరోజుల లోపు బన్నీ అందుబాటులోకి రావాల్సి. ఈ నేపథ్యంలో సుక్కుకు బన్నీ డెడ్ లైన్ పెట్టారని చెప్పుకొంటున్నారు. అయితే సుక్కు క్రియేటివిటీ గురించి తెలిసిందే. ఏ మాత్రం సరిగ్గా రాకున్నా రీ షూట్స్ కి వెళ్లే టైపు. మరీ.. బన్నీ డెడ్ లైన్ కు పుష్పని పూర్తి చేస్తాడేమో చూడాలి.