బన్నీ కొత్త లుక్.. అదిరింది !


సినిమా సినిమాకి కొత్త లుక్ లోకి మారిపోవడం స్టార్స్ కి అలవాటే. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్  అయితే తన లుక్ పై ఇంకాస్త ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. ఆయన తాజాగా కొత్త లుక్ లోకి మారిపోయారు. రింగు రింగుల జుట్టుతో స్టయిలీష్ గా కనిపిస్తున్నారు. ఇది ‘పుష్ప’ సినిమా కోసం. సుకుమార్-బన్నీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఎర్రచందనం తరలించే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వదిలారు. ఇందులో రింగు రింగు జుట్టుతో బన్నీ కనిపించారు. ఇప్పుడీ లుక్ లో స్టయిల్ గా దిగిన పిక్స్ ని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ పిక్స్ వైరల్ అవుతున్నాయ్. బన్నీ లుక్ అదిరిందని అభిమానులు చెప్పుకొంటున్నారు.