మహేష్ కత్తి మరోసారి అరెస్ట్ 

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ మరోసారి అరెస్ట్ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీరాముడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేయడంపై ఇటీవల కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఫిబ్రవరి నెలలోనూ ఇలానే సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన వ్యాఖ్యలపై జాంబాగ్‌కు చెందిన ఉమేశ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గురువారం మహేష్‌ను మరోమారు అరెస్టు చేశామని సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపారు. మొత్తానికి మహేష్ రెండ్రోజులకోసారి అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా అవుతోంది.