సుశాంత్-సారా కలిసి గడిపారా ?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకి రియా చక్రవర్తి కాకుండా మరో గర్ల్ ఫ్రెండ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు. స్టార్ కిడ్ సారా అలీఖాన్. సుశాంత్-సారా జంటగా కేధార్ నాద్ సినిమా వచ్చింది. ఈ సినిమా సమయంలోనే సుశాంత్ సారాతో ప్రేమలో పడ్డారని తాజాగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. అవుట్ డోర్ షూటింగ్ టైమ్ లో వీరిద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారని చెబుతున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు గల కారాణాల్లో సారా కూడా ఒకటి చెప్పుకొంటున్నారు. సారాపై హీరోయిన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. సారా సినీ వారసత్వంతో వచ్చిందని, అలాంటి వారికి ప్రేమ విలువ తెలీదని కంగనా క్లాసు వేసుకుంది. సారా మొదట్లో అతడితో రూమ్ షేర్ చేసుకుని, ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. నిజంగానే.. సుశాంత్-సారా కలిసి గడిపారా ? అది వారిద్దరికే తెలియాలి మరీ..!