కొండగట్టు నుంచి పవన్ రాజకీయ యాత్ర
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రపై ప్రకటన చేశారు. ‘అజ్ఝాతవాసి’ సినిమా తర్వాత పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేయనున్నట్టు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పవన్ జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తల ఎంఫిక, హైదరాబాద్’లో పార్టీకి మరమత్తులు, డిజిటల్ టీమ్ ఏర్పాటు వంటి పనులని పూర్తి చేసుకొన్నాడు. తాజాగా, తన రాజకీయ యాత్రను ప్రారంభించే వేదికని కూడా ప్రకటించేశాడు.
కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్రని ప్రారంభించబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా స్పష్టమైన ప్రకటన చేశారు. అందుకు తనకు గల సెంటిమెంట్ ని కూడా అభిమానులతో పంచుకొన్నాడు. 2009 ఎన్నికల సమయంలో జరిగిన పెను ప్రమాదం నుంచి ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. ఇదీగాక, అంజనేయస్వామి మా ఇంటి ఇలవేల్పు.. అందుకే ఇక్కడ నుంచే నా పర్యటన ప్రణాఌకని ప్రకటిస్తాను. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యల అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడం కోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి.. అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.