రష్మి రాకెట్‌ అప్ డేట్

టాలీవుడ్ లో తాప్సీకి కలిసిరాలేదు. కానీ బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. కథా బలమున్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది ‘థప్పడ్‌’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాప్సీ మరోసారి వైవిధ్యమైన కథను ఎంచుకున్నారు. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో ‘రష్మి రాకెట్‌’గా అలరించబోతున్నారు. ప్రియాన్షు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తాప్సీ రన్నర్‌గా కనిపించనున్నారు.

ఇప్పుడీ సినిమా షూటింగ్ అప్ డేటు వచ్చింది. నవంబర్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర బృందం తెలిపింది. రోని, నేహా ఆనంద్‌, ప్రంజల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరిస్తోంది. యేడాదికో తెలుగు సినిమా చేస్తోంది.