మీ ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది : చిరు

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. వాటితో సోషల్ మీడియాలో ట్రాఫిక్ జామ్ అయినంత పనైంది. ఈ
ప్రేమకు మెగాస్టార్ ఫిదా అయిపోయారు. తన బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఝతలు తెలిపారు. 

“అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. ఈ ప్రేమే నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఈ ప్రేమే నా జీవితంలో లభించిన మహత్తరమైన అదృష్టంగా భావిస్తాను. మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు.

ఇక మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ లు వచ్చేశాయ్. ఆయన తాజా చిత్రం ఆచార్య నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో కామ్రెడ్ టచ్, పోషన్ పోస్టర్ లో యాక్షన్ టచ్ చూపించారు. రెండు అదిరిపోయాయ్. సింగిల్ డైలాగ్, యాక్షన్ బిట్ లేకుండా కేవలం పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలని పీక్స్ వెళ్లేలా చేశారు.