సోనూసూద్ సింగిల్ ట్విట్’తో నిధులు మంజూరు

బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ విజయనగరం జిల్లా సాలూరు గిరిజనులను అభినందిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సాలూరు మండలంలోని మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి 4కి.మీల మేర రహదారి నిర్మాణం చేపట్టిన గిరిజనులను ఆయన అభినందించారు.యావత్‌ దేశాన్ని మీ స్ఫూర్తి ప్రేరేపిస్తుందని కొనియాడారు. మీ ప్రేరణ దేశం మొత్తం అనుసరించాలని.. అందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేద్దామంటూ సోనూసూద్‌ పిలుపునిచ్చారు. త్వరలో కొదమ గ్రామాన్ని సందర్శించనున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే.

తాజాగా సోనూసూద్ ట్విట్ కు విజయనగరం జిల్లా అధికారులు స్పందించారు. సాలూరు మండలంంలోని చింతామల గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ పర్యటించారు. రూ.10లక్షలతో గిరిజనులు సొంతంగా నిర్మించుకున్న రహదారిని పరిశీలించారు. రహదారి నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రహదారితో పాటు తాగునీరు, విద్యా, వైద్య వసతులు కల్పిస్తానని భరోసా ఇచ్చారు.