అదే నేను చేసిన తప్పు : రియా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తున్నాయ్. ఈ కేసుని సీబీఐ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. వేగంగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ధోషిగా పలు కీలక ఆధారాలు దొరుకుతున్నట్టు సమాచారమ్.
సుశాంత్ కి తెలియకుండా ఆయనకి డ్రగ్స్ ఇచ్చేదట రియా. అంతేకాదు.. సుశాంత్ తో తరచు గొడవపడుతుందేట. సుశాంత్ చనిపోవడానికి ముందు (జూన్ 8) కూడా పెద్ద గొడవ చేసిందట. అంతేకాదు.. ఆ రోజు సుశాంత్ ఇంట్లో 8 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం అయ్యాయని దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. సుశాంత్ పై ఫ్లోర్ లో ఉంటే.. రియా కింది ఫ్లోర్ లో పార్టీలు చేసుకొనేదని ఇంట్లో పని చేసిన వాళ్లు సీబీఐ దర్యాప్తులో చెప్పినట్టు కథనాలు వినిపిన్నాయి.
మరోవైపు సుశాంత్‌ని ప్రేమించడం నేను చేసిన పెద్ద తప్పు. నన్ను ఎవరు విచారించినా కూడా ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే నిజాలని నేను దాచడం లేదని ఓ న్యూస్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చెప్పుకొచ్చింది. ఇంతకీ సుశాంత్ ఆత్మహత్య వెనక రియా పాత్ర ఏంటీ ? అన్నది సీబీఐ విచారణ పూర్తయితేగానీ తేలేలా లేదు.