టిక్ టాక్ సీఈఓ రాజీనామా
టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేశారు. తాను ఈ సంస్థ నుంచి వైదొలగుతున్నానని కెవిన్ మేయర్..స్టాఫ్ కి రాసిన ఓ లేఖలో తెలిపారు. ఇక ఈయన స్థానే ఈ సంస్థ ప్రస్తుత జనరల్ మేనేజర్ వనేసా పప్పాస్ తాత్కాలిక సీఈఓ గా వ్యవహరించనున్నారు.
అమెరికాలో తమ సంస్థ కార్యకలాపాలను నిషేధిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని సవాలు చేస్తూ..టిక్ టాక్ ఉద్యోగుల్లో ఒకరు వేరుగా కోర్టుకెక్కారు. బహుశా ఈ పరిణామం వల్లే మేయర్ రాజీనామా చేశారని భావిస్తున్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే చైనా వ్యతిరేక ప్రచారంలో భాగంగానే టిక్ టాక్ ని బ్యాన్ చేశారు కదూ అని రెండు సంస్థలూ గుర్రుమంటున్నాయి.