వరుణ్ తేజ్’తో పోలీస్ స్టోరీ ?
ఖాకీ డ్రెస్ వేస్తే ఆ కాన్ దాన్ నే వేరు. ఇక హీరోలు ఖాకీ డ్రెస్ వస్తే వారి అభిమానులకి పండగే. అందుకే కథానాయకులు కూడా పోలీస్ పాత్రలు పోషించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తొలిసారి పోలీస్ డ్రెస్ వేయబోతున్నట్టు సమాచారమ్. 14 రీల్స్ లో వరుణ్ తేజ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సాగరచంద్ర దర్శకత్వం వహించనున్నారు.
వరుణ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పవర ఫుల్ పోలీసాఫీసర్ పాత్రతో కూడిన కథను సిద్ధం చేశాడట. అది వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. 14 రీల్స్ లో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ బ్యానర్ లో నటిస్తున్న రెండో సినిమా కోసం వరుణ్ మాస్ స్టోరీనే ఎంచుకోవడం విశేషం.
ప్రస్తుతం వరుణ్ తేజ్ బ్యాక్సర్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత సాగర్ చంద్ర సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తారని తెలుస్తోంది.