వైరల్ : ఎరుపురంగు చీరలో అనసూయ అందాలు

హాట్ యాంకర్ అనసూయ ట్రైయాంగిల్ లో అలరిస్తోంది. ఇటు యాంకర్ గా, అటు నటిగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు సరిపోవు అన్నట్టుగా ఆమె నుంచి ఫోటో షూట్స్ క్యూ కడుతుంటాయ్. అవి ఆకట్టుకొంటాయ్. యూత్ కి పిచ్చెక్కించేలా ఉంటాయ్. తాజాగా రెడ్ కలర్ చీరలో అనసూయ చేసిన ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

యాంకర్ గా బిజీగా గడుపుతున్న అనసూయ సినిమాలతోనూ బిజీ అవుతోంది. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం, కథనం సినిమాలతో అనసూయ మంచి నటి అనిపించుకుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత ఆమెకు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు క్యూ కడుతున్నాయ్. ప్రస్తుతం ఆమె రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు సమాచారమ్. వీటిలో సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ ఒకటని చెబుతున్నారు.