సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. 11 మంది సినిమా స్టార్స్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నందు, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, చిన్నా, చార్మీ, ముమైత్ ఖాన్ ని విచారించారు. నిందుతుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకుల నమూనాలను సేకరించారు. ఈ కేసులో ఎవ్వరినీ వదలి పెట్టేది లేదని అప్పట్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు బలంగా చెప్పారు.ఆ తర్వాత ఈ కేసుని నీరు గార్చారు అనే ఆరోపణలున్నాయి.
తాజాగా కర్నాటక సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక సినీ పరిశ్రమలోని కీలక వ్యక్తులకు మాదక ద్రవ్యాల వ్యాపారాలతో సంబంధాలున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సంచాలకుడు కేపీఎస్ మల్హోత్ర తెలిపారు. బెంగళూరులోని ఓ హోటల్లో బుధవారం 2.20 లక్షల విలువ చేసే ఎండీఎంఏ (మెథిలిన్ డయాక్సీ మెథాపెటమిన్) మాత్రలను ఎన్సీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ధ్రువీకరించారు. రహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
జర్మనీ, ముంబయి నుంచి ఆన్‌లైన్‌ద్వారా విక్రయించే ఈ మాదక ద్రవ్యాన్ని కన్నడ చలనచిత్ర రంగంలోని నటులకు, మ్యూజిషియన్స్, కాలేజీ స్టూడెంట్స్, యువకులకు ఇచ్చినట్లు వెల్లడించారని కెపిఎస్ మల్హోత్రా తెలిపారు. కన్నడ సినీ స్టార్స్ లో ఎవరెవరు ? ఈ కేసుతో సంబంధాలున్నాయి అనే విషయం త్వరలోనే వెలుగులోకి రానున్నాయని తెలుస్తోంది.