సుశాంత్’కు అన్నీ అలవాట్లు ఉన్నాయ్ : రియా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణానికి ఆమె కారణం. సుశాంత్ కి రియానే డ్రగ్స్ అలవాటు చేసింది. ఆయన నుంచి డబ్బు గుజుంది. సుశాంత్ కి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చి.. ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైందనే ఆరోపణలున్నాయి. రియాపై నార్కోటిక్ కంట్రోల్ బోర్డు (ఎన్సీబీ) బుధవారం క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం రాత్త్రి ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. సుశాంత్ కు అన్నీ అలవాట్లు ఉన్నాయి. గంజాయి తీసుకునే వాడు, క్రమం తప్పకుండా మద్యం సేవించే వాడని చెప్పింది. అంతేకాదు.. 2018లో అతనిపై మీటూ ఆరోపణలు రావడంతో సుశాంత్ మానసికంగా చాలా కుంగిపొయాడు. అతని సినిమాలకి కూడా తగిన క్రెడట్ లభించకపోవడంపై చాలా బాధపడేవాడని చెప్పుకొచ్చింది.
అయితే సుశాంత్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? అన్నది మాత్రం తనకి అర్థంకావడం లేదన్నది. అన్నీ అలవాట్లు ఉన్న సుశాంత్ తో ఎందుకు ప్రేమలో పడినట్టు ? అన్నది మాత్రం సుశాంత్ దాటవేసింది.
#RheaChakraborty in the hot seat. No questions spared. Rajdeep questions her on the infamous Europe trip and #Sushant's mental health. #IndiaTodayGrillsRhea @SardesaiRajdeep
Watch the full interview tonight at 9 PM on India Today TV. pic.twitter.com/yQEkBMcKCl— IndiaToday (@IndiaToday) August 27, 2020