నిత్యానందపై మనసు పారేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ

నిత్యానంద స్వామిపై రాసలీల స్వామిగా ముద్రపడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ నటితో స్వాములోరు నడిపిన రాసలీల వీడియో టేపు లీకైంది. వైరల్ అయింది. అత్యాచార ఆరోపణలతో భారత్ నుంచి పరారైన నిత్యానంద.. ప్రత్యేకంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేశారు. ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ దేశాన్ని ప్రకటించారు. ప్రత్యేక కరెన్సీ, బ్యాంకు ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇటీవల నిత్యానందపై బిగ్ బాస్ బ్యూటీ మీరామిథున్ ప్రశంసలు కురుపించింది. అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్లే ఆయన మరింత శక్తి వంతుడు అయ్యాడని అభిప్రాయపడింది. ‘లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ పేర్కొంది. అయితే మీరామిథున్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తమీ కాదు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైంది. కోలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 3లో ఈ బ్యూటీ మెరిసిన సంగతి తెలిసిందే.