సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ 4 మొదలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టార్ మా టీజర్ ని రిలీజ్ చేసింది. సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి బిగ్ బాస్ 4 ప్రారంభం కానుందని తెలిపింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. షోలో మునుపటిలా రాసుకోవడాలు, పూసుకోవడాలు, హగ్ లు ఉండవ్. ఏం చేసినా భౌతిక దూరం పాటిస్తూ చేయడమే. టాస్క్ లు అలానే ఉండబోతున్నాయ్. ఇక ఈ సీజన్ ని 10వారాలకి కుదించనున్నారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రఘు మాస్టర్‌, ఆయన భార్య ప్రణవి, మహాతల్లి, ఆమె భర్త సుశాంత్‌, హెచ్‌ఎంటీవీలో వ్యాఖ్యాత సుజాత, టిక్‌టాక్‌ స్టార్‌ అరియానా గ్లోరీ, మెహబూబ్‌ దిల్‌సే, సోహైల్‌ రియాన్‌, కరాటే కల్యాణి, లాస్య, నోయల్‌, యాంకర్‌ ప్రశాంతి, జబర్దస్త్‌ అవినాష్‌లు ఈసారి షోలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.