ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే : సుప్రీం

కరోనా ప్రభావంతో పరీక్షలు రద్దవుతున్న సంగతి తెలిసిందే. అయితే కళాశాల, యూనివర్సిటీ విద్యార్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందేననే తాజాగా సుప్రీం స్పష్టం చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది. అయితే ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.