జేఈఈ, నీట్ వాయిదాపై సుప్రీంకు వెళ్లిన 6 రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా జేఈఈ, నీట్ వాయిదా కోసం ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు సంయుక్తంగా శుక్రవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

జేఈఈ, నీట్ నిర్వహణపై ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరారు. ఒక‌వైపు కరోనా మహమ్మారి, మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల తమ తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ఆరు రాష్ట్రాల ముంత్రులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

మరోవైపు మరోవైపు నీట్, జేఈఈ పరీక్షలని వాయిదా వేసే ప్రసక్తే లేదని, అవి షేడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఓ ప్రకటన చేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు JEE (main), సెప్టెంబర్ 13న NEET (UG) పరీక్షలు జరగనున్నాయి.