ఆచార్య ఆరోపణలు.. కొరటాల ఓపెన్ ఆఫర్ !
ఆచార్య కథపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కథ నాదే అంటూ రాజేష్ అనే సహాయ దర్శకుడు మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. దీనిపై కొరటాల శివ మీడియా ముందుకొచ్చి మరీ వివరణ ఇచ్చుకున్నారు. రాజేష్ గారి కథకీ నాకూ సంబంధం లేదు. ఆయన ఆ కథతో సినిమా తీసుకోవొచ్చు. నా సినిమా కంటే ముందు రిలీజ్ చేసుకోవొచ్చు. కావాలంటే మీడియా ముఖంగా సంతకం చేసి ఇస్తానని ఓపెన్ ఆపర్ ఇచ్చారు.
రాజేష్ చెబుతున్నట్టు తాను ఉత్సవం నేపథ్యంలో ఓ పాట, ఓ ఫైటు తీయలేదు. ఆయన చెబుతున్నట్టు అసలు తనది దేవాదాయ భూముల నేపథ్యంలో నడచే కథే కాదని కొరటాల స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కొరటాల క్లారిటీ కనిపిస్తున్నారు. ఆరోపణలు చేస్తున్న సహాయ దర్శకుడు రాజేష్ చెప్పే వాటిలో కొన్ని రుజువులు ఉన్నాయని చెప్పి… ఆ తర్వాత లేవని మాట మారవడం అనుమానాలకి తావినిస్తోంది.