నూతన్ నాయుడుపై శిరోదండనం ఆరోపణలు

సామాన్యుడు నూతన్ నాయుడు బిగ్ బాస్ షోతో సెలబ్రిటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల సమన్వయ కర్తగా మారడు. ఇటీవల పరాన్నజీవి పేరిట సినిమా తీసి.. పవన్ అభిమానుల కళ్లలో ఆనందాని చూసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు నూతన్ నాయుడు పాడు పని చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఇంట్లో గత నాలుగు నెలలుగా పనిచేస్తున్న ఓ యువకుడికి అతడి ఇంట్లోని గుండు గీయించాడు.

ఇప్పుడీ ఆ యువకుడు మీడియా ముందుకొచ్చి తన ఆవేధనని చెప్పుకున్నాడు. తనకి శిరోదండన చేసే సమయంలో నూతన్ నాయుడు భార్య కూడా అక్కడే ఉన్నారని యువకుడు చెబుతున్నాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన్ నాయుడు ఇంట్లో గతనాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నాడు.

అయితే చెప్పాపెట్టకుండా అతను పని మానేయడంతో . నూతన్ నాయుడు కుటుంబసభ్యులు ఇంట్లో సెల్ ఫోన్ కనిపించడం లేదు ఇంటికిరా మాట్లాడుకుందాం అని పిలిచి శిరోముండనంకు పాల్పడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరితో అయినా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించారట . బాధితుడు మనస్తాపంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు.