యాదాద్రి గర్భాలయ విమాన గోపురానికి బంగారు తాడపం
యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం పునర్నిర్మాణ పనుల్లో వేగంగా జరుగుతున్నాయి. గర్భాలయ విమాన గోపురానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని తాజాగా ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు. గర్భాలయ విమాన గోపురానికి రూ.40 కోట్ల వ్యయంతో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించామని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని భక్తులు ముందుకు వస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇప్పటికే యాదాద్రి దేవస్థానం వద్ద ఉన్న ఉపయోగంలో లేని బంగారంతో ధ్వజస్తంభం, ప్రధానాలయ తలుపులకు బంగారు తాపడం చేయించామని, బంగారు తొడుగుల బిగింపు పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం బస్బే, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. నాలుగంతస్తులో ప్రసాదాల తయారీ భవనం పూర్తైంది. మూడో అంతస్తులో యంత్ర పరికరాల బిగింపు మొదలైంది.