నాగ్ అందంపై.. వర్మ ఆశ్చర్యం !

మన్మథుడు నాగార్జున 61వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా నాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో నాగ్ అందంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

“మీరు ఏమి తింటున్నారో నాకు తెలియదు, ఏ దేవుడుని ప్రార్థిస్తున్నారో.. ఇంకేం చేస్తారో తెలియాదు. కానీ ప్రతి పుట్టినరోజుకి మీరు ఇంకా ఇంకా  యంగ్ అయిపోతున్నారు..ఇలా అయితే కలకాలం ఇలాగే జీవించ బోతున్నారు”అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇక నాగ్ బర్త్ డే కానుకగా ఆయన తాజా చిత్రం వైల్డ్ డాగ్ నుంచి పోస్టర్ ని విడుదల చేశారు. నాగ్-విక్రమ్ కుమార్ సినిమా థ్యాంక్యూ అప్ డేట్ ఇచ్చారు.