సెప్టెంబర్ 30 వరకు స్కూల్స్, కాలేజీలు బంద్ !

#Unlock4 గైడ్ లైన్స్ ని తాజాగా కేంద్రం విడుదల చేసింది. మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిమ్ది. అయితే స్కూల్స్, కాలేజీ లు మాత్రం సెప్టెంబర్ 30 వరకు మూసే ఉంటాయని ప్రకటించింది. సినిమాలు, స్వమ్మింగ్ ఫూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, కోచింగ్ సెంటర్లకి అనుమతులు ఇవ్వలేదు. అంతర్జాతీయ ప్రయాణికులకి కూడా అనుమతులు ఇవ్వలేదు.

అయితే, #Unlock4 టైమ్ గడిచే కొద్ది కొన్ని మరికొన్ని వెసులుబాటులు కల్పించనుంది. సెప్టెంబర్ 21 నుంచి విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలని జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వనుంది. అయితే అది 100 మందికి మించరాదు. 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ల కి అనుమతి ఇవ్వనుంది. 21  నుంచి  పరిమిత సంఖ్యలో సామాజిక కార్యకలాపాలకి అనుమతులు ఇవ్వనుంది.