గవర్నర్ పరామర్శించిన సీఎం కేసీఆర్
గవర్నర్ తమిళిసైను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న కుమారుడు శుక్రవారం మరణించారు. గవర్నర్ తండ్రి అనంతన్ సైతం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసీఆర్ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు.
అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల గురించి సమాచారం ఇచ్చినట్టు ఉంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి గవర్నర్ తమిళిసైకి తెలియజేశారు.
ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన గవనర్ తమిఌసై కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఏం కేసీఆర్, గవర్నర్ మధ్య గ్యాప్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్-గవర్నర్ కలవడం ఇదే తొలిసారి.