అమెరికా అధ్యక్ష పదవికి ఇవాంక.. ట్రంప్ ప్రకటన !
అమెరికా అధక్ష పదవిని రెండోసారి చేపట్టాలనే పట్టుదలతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే కరోనా ఎఫెక్ట్, డొమెట్రిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ పోటీకి దిగడంతో ట్రంప్ కు ఆశలు సన్నగిల్లాయ్. ఈ నేపథ్యంలో ట్రంప్ తన కూతురు ఇవాంక ట్రంప్ ని తెరపైకి తెచ్చారు.ఇవాంక దేశ అధ్యక్షురాలు కావాలని తన మనసులోని మాటని బయటపెట్టారు ట్రంప్.
“కమలా హారీస్ అసమర్థురాలు. ఉన్నత పదవులకు సరిపోరు. నేను కూడా దేశానికి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే కమలాహారీస్ లాంటి వారు కాదు. ‘వి వాంట్ ఇవాంక’ అని మీరంతా అంటున్నారు. ఇందుకు నేనేమీ మిమ్మల్ని తప్పుపట్టను. ఇవాంక అయితే అధ్యక్ష పదవికి సరిపోతారు” అన్నారు ట్రంప్. న్యూహాంప్‌షైర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.