ట్రెండింగ్’లో #IndianStyleIconAlluArjun


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాంఛి మూడులో ఉన్నారు. బహుశా.. వరల్డ్ రికార్డ్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలకి సంబంధించిన యాష్ ట్యాగ్ వ్యూస్ విషయంలో రికార్డులు సృష్తిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రోజున ఆయన అభిమానులు వరల్డ్ రికార్డ్ కొట్టేశారు. ఆ తర్వాత దాన్ని పవర్ స్టార్ పవర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. చేశారు కూడా.

ఇప్పుడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. #IndianStyleIconAlluArjun యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ దాటిపోయాయ్. ట్రెండింగ్ టాప్ 3 లో కొనసాగుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ  యేడాది అల.. వైకుంఠపురంలో సినిమాతో బన్నీ హిట్ కొట్టారు. ఆయన తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప తెరకెక్కనుంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది.