నానితో ఉన్న బంధాన్ని బయటపెట్టిన నివేదా

నాని-నివేదా థామస్ లది హిట్ కాంబో. నాని ‘జెంటిల్ మెన్’తో తెలుగు తెరకు పరిచయం అయింది నివేదా. ఆ తర్వాత ‘నిన్నుకోరి’ సినిమా కోసం మరోసారి జతకట్టారు. అయితే జెంటిల్ మెన్ సినిమా టైమ్ లోనే నివేదా కు లేడీ కమల్ హాసన్ అనే బిరుదు ఇచ్చేశారు నాని. ఇప్పుడు వీరి కాంబోలో మూడో చిత్రంగా ‘వి’ రాబోతుంది.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘వి’ తెరకెక్కింది. నాని, సుధీర్ బాబు, నివేదా, అతిధి రావు కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో ‘వి’ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేదా.. నానితో ఉన్న బంధాన్ని గురించి వివరించింది.

వ్య‌క్తిగ‌తంగా నాని మా కుటుంబ‌స‌భ్యుల్లో ఒక‌డు. జెంటిల్ మెన్ సినిమా నుంచి మా ఇద్ద‌రి మైండ్ సెట్ లో చాలా మార్పులు వ‌చ్చాయి. నేనేదైనా క‌థ‌ను ఇష్ట‌ప‌డితే అది వెంట‌నే నానితో షేర్ చేసుకుంటా. మేమిద్ద‌రం ఆ క‌థ గురించి చ‌ర్చించుకుంటాం. ప్ర‌తీసారి మేం ఏదో ఒక‌టి నేర్చుకుంటామ‌ని చెప్పుకొచ్చింది. దీంతో నాని-నివేదా రెగ్యూలర్ గా టచ్ లో ఉంటారని అర్థమవుతోంది.